Jump to content

రూర్కీ

అక్షాంశ రేఖాంశాలు: 29°52′N 77°53′E / 29.87°N 77.88°E / 29.87; 77.88
వికీపీడియా నుండి
  ?रुड़की
రూర్కీ
ఉత్తరాఖండ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 29°52′N 77°53′E / 29.87°N 77.88°E / 29.87; 77.88
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 268 మీ (879 అడుగులు)
జిల్లా (లు) హరిద్వార్ జిల్లా
జనాభా
అక్షరాస్యత శాతం
2,52,784 (2011 నాటికి)
• 83%
లోక్‌సభ నియోజకవర్గం హరిద్వార్
శాసనసభ నియోజకవర్గం రూర్కీ
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 247667
• +91 1332
• UK 08

రూర్కీ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది గంగా కాలువ ఒడ్డున, ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారి పై ఉంది. భారతదేశంలోని అత్యంత పాతవైన సైనికస్థావరాలలో రూర్కీ కంటోన్మెంట్ ఒకటి. అంతేగాక 1853 నుండి బెంగాల్ ఇంజనీర్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆసియాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల (ప్రస్తుతం భా.ప్రౌ.సం లేదా ఐ.ఐ.టీ) కూడా ఇక్కడ ఉంది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఉండటం చేతనూ, గంగా నది కాలువల నిర్వహణ యంత్రాంగానికి, ప్రధాన స్థానం కావడం చేతనూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుటుండుటచేతనూ, రూర్కీ విద్యావంతుల నగరంగానూ, ఇంకా ముఖ్యంగా ఇంజనీర్ల నగరంగా భాసిల్లుతోంది.

చరిత్ర

[మార్చు]

జనసంఖ్య

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం రూర్కీ జనాభా 252,784. జనాభాలో స్త్రీ పురుషుల నిష్పత్తి 47:53 గా ఉంటుంది. అక్షరాస్యత 83%గా ఉండి జాతీయ అక్షరాస్యతకన్నా ఎక్కువగానే ఉంటుంది. జనాభాలో 61% హిందువులు (వీరిలో 29.9% బ్రాహ్మణులు,13.8% వైశ్యులు, 17.3% ఇతర కులములు ), 28% మహమ్మదీయులు, 9% శిక్కులు, 1.7% జైనులు, 0.3% క్రైస్తవులు ఉన్నారు. హిందీ, ఉర్దూ, పంజాబీ ఇక్కడి ప్రధాన భాషలు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రూర్కీ పట్టణం భారతదేశంలోని వివిధ పట్టణాలతో రోడ్డు, రైలు సౌకర్యాలతో అనుసంధానింపబడి ఉంది. రూర్కీ రైల్వే స్టేషను హౌరా-అమృతసర్ ప్రధాన లైన్ పైన ఉంది. రూర్కీ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రపు ప్రధాన రోడ్డు కూడళ్లలో ఒకటి. రెండు జాతీయ రహదారులు 58 (ఢిల్లీ- హరిద్వార్-మనా), 73 (పంచకుల/చండీఘఢ్ - యమునానగర్-రూర్కీ) రూర్కీ నడిబొడ్డునుండి పోతున్నాయి. పరిసర పట్టణాలైన హరిద్వార్,డెహ్రాడూన్, ఋషీకేశ్, సహారన్‌పూర్, మీరట్, ముజఫర్‌నగర్, అంబాలా, చండీఘఢ్, ఢిల్లీలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు ఉన్నాయి. అత్యంత సమీపంలోని ఎయిర్‌పోర్ట్ డెహ్రాడూన్ లో ఉంది.

విద్యాలయాలు, పరిశోధనాసంస్థలు

[మార్చు]

రూర్కీ పట్టణం అనేక విద్యాసంస్థలకీ, పరిశోధనా సంస్థలకీ నిలయమై ఉంది. రూర్కీలోని భారతీయ ప్రౌద్యోగిక సంస్థానం ప్రముఖమైనది. ఇది థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌గా ప్రారంభమైన, అటుపైన రూర్కీ విశ్వవిద్యాలయంగా మారి, 2001లో భారతీయ ప్రౌద్యోగిక సంస్థానం (ఐ.ఐ.టీ)గా ఏర్పడింది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇదే. రూర్కీలోని పరిశోధనా సంస్థల్లో కేంద్రీయ భవన పరిశోధనా సంస్థానం (CBRI), నీటి పారుదల పరిశోధనా సంస్థానం (Irrigation Research Institute), ప్రత్యామ్నాయ జలశక్తి కేంద్రం (AHEC), నీటిపారుదల నమూనాల సంస్థ (Irrigation Design Organization), జాతీయ జల విజ్ఞాన సంస్థానం (NIH) ప్రముఖమైనవి. ఇవి కాక అనేక వృత్తివిద్యా కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు కూడా ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=రూర్కీ&oldid=3139154" నుండి వెలికితీశారు