పోలియో టీకా
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఐపోల్, పోలియో వాక్స్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a601177 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? (AU) ? (US) |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | Parenteral (IPV), by mouth (OPV) |
Identifiers | |
ATC code | J07BF01 J07BF02 J07BF03 J07BF04 |
DrugBank | DB10796 |
ChemSpider | None |
Chemical data | |
Formula | ? |
(what is this?) (verify) |
పోలియో టీకా, చిన్నారుల్లో వచ్చే పోలియో వ్యాధి నివారణకు ఉపయోగించే టీకా. ఇది క్రియారహిత ఇంజెక్షన్ (ఐపివి)గా, నోటి టీకా (ఓపివి)గా రెండు రకాలుగా ఉపయోగించబడుతుంది. పిల్లలకి వచ్చే పోలియో వ్యాధికి పూర్తిగా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. ఈ రెండు టీకాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోని పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాయి.[1][2] ప్రతి సంవత్సరం సేకరించిన నివేదిక ప్రకారం ప్రకారం 1988లో 350,000 గా ఉన్న పోలియో కేసుల సంఖ్య నుండి 2018లో 33కి తగ్గింది.[3]
క్రియారహితం చేసిన పోలియో వ్యాక్సిన్లు చాలా సురక్షితం అని చెప్పవచ్చు. పోలియో ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో చర్మం ఎరుపు రంగులోకి మారవచ్చు, నొప్పి కలిగించవచ్చు. గర్భధారణ సమయంలో, హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నవారికి కూడా ఇవి సురక్షితమని వైద్యులు సూచించారు.
టీకాలు
[మార్చు]బలహీనపడ్డ లేదా మృత వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు. చాలా సందర్భాల్లో ఇంజెక్షన్ ద్వారా ఈ పనిచేస్తారు. శరీరంలోని తెల్లరక్తకణాలు ప్రేరేపితమై, వ్యాధిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. సదరు వ్యక్తికి తర్వాత వ్యాధి వస్తే, సంబంధిత కణాలను యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తాయి.
పోలియో టీకాల తయారీ
[మార్చు]ఈ రెండు టీకాల్లో మొదటి టీకాను జోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేయగా, 1952లో ఇది మొదటిసారిగా పరీక్షించబడింది. 1955 ఏప్రిల్ 12న సాల్క్ ప్రపంచానికి తెలిసేలా దీనిపై ఒక ప్రకటన చేశాడు. దీంట్లో ఇంజెక్ట్ చేయబడిన క్రియాశూన్యమైన (మృత) పోలియోవైరస్ డోస్ ఉంది. ఆల్బర్ట్ సబిన్ అనే శాస్త్రవేత్త పోలియో వైరస్‌ని ఉపయోగించి నోటితో తీసుకునే టీకాను తయారు చేశాడు. ఈ టీకాని మానవ నమూనాలకు ఉపయోగించడం 1957లో ప్రారంభమవ్వగా, 1962లో దీనికి లైసెన్స్ దొరికింది. ఎందుకంటే రోగనిరోధకశక్తితో పోటీపడే వ్యక్తులలో పోలియో వైరస్ కోసం దీర్ఘకాలం కొనసాగే వాహక స్థితి లేదు. ఈ రెండు టీకా మందులు ప్రపంచంలోని పలు దేశాలలోని పోలియో వ్యాధిని నిర్మూలించాయి. ఇది 1988లో ప్రపంచమంతటా ఉన్న 350,000 కేసులను 2007లో 1,625 కేసులకు తగ్గించగలిగిందని అంచనా వేయబడింది.
సాధించిన ప్రగతి
[మార్చు]ఈ రెండు పోలియో టీకాల అభివృద్ధి మొట్టమొదటి ఆధునిక సామూహిక టీకాలకు దారితీసింది. యునైటెడ్ స్టేట్స్ లో చిట్టచివరి పారలైటిక్ పోలియోమైఎలిటిస్ కేసు 1979లో నమోదైంది. 1994 నాటికి ఈ వ్యాధి అమెరికా ఖండంలో పూర్తిగా నిర్మూలించబడింది. 2000 నాటికి చైనా, ఆస్ట్రేలియాతోపాటుగా 36 పాశ్చాత్య పసిఫిక్ దేశాలలో పోలియో నిర్మూలించబడినట్లు అధికారికంగా ప్రకటించబడింది. పోలియో నుంచి బయటపడినట్లు ఐరోపా 2002లో ప్రకటించింది. ప్రస్తుతం నైజీరియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ వంటి నాలుగు దేశాలలో మాత్రమే పోలియో సాంక్రమిక వ్యాధిగా కొనసాగుతోంది. పోలియో వైరస్ వ్యాప్తి ప్రపంచంలో చాలావరకు అరికట్టబడినప్పటికీ, పోలియోవైరస్ డోస్ సరఫరా మాత్రం కొనసాగుతూనేవుంది.
భారతదేశంలో
[మార్చు]తొలిసారిగా 1985లో ప్రపంచ వ్యాధి నిరోధక శక్తి కార్యక్రమంలో మొదటిసారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభించారు.
భారతదేశంలో పోలియోను నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1995లో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1.5 లక్షల మంది సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో 24 లక్షల మంది వైద్య వాలంటీర్లు పాల్గొని మొదటిసారిగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందించారు.
2011, జనవరి 13న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా ప్రాంతంలో చివరిసారిగా ఒక అమ్మాయికి పోలియో కేసు నమోదైంది. 2011 నుంచి 2014 వరకు దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడంతో 2014, మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో రహిత దేశంగా ప్రకటించింది.
పల్స్‌పోలియో 2022
[మార్చు]2022 ఫిబ్రవరి 27 (పోలియో ఆదివారం) నుంచి మూడు రోజుల పాటు అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. పోలియో చుక్కలు అందించే కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోనున్నారు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Global Wild Poliovirus 2014–2019" (PDF). Retrieved 3 February 2019.
- ↑ "Does polio still exist? Is it curable?". World Health Organization (WHO). Retrieved 2018-05-21.
- ↑ "Poliomyelitis". World Health Organization (WHO). Archived from the original on 18 April 2017. Retrieved 25 April 2017.
- ↑ Telugu, TV9 (2022-02-26). "Pulse Polio: తల్లిదండ్రులకు అలర్ట్.. రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. పూర్తి వివరాలు." TV9 Telugu. Retrieved 2022-02-26.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Telangana News: 27న పల్స్‌పోలియో నిర్వహణకు ఏర్పాట్లు: హరీశ్". EENADU. Retrieved 2022-02-26.
ఇతర లంకెలు
[మార్చు]- 2018 నాటికి పోలియో నిర్మూలనకు గ్లోబల్ పోలియో నిర్మూలన ఇనిషియేటివ్ ఫైనల్ ప్రాజెక్ట్.
- టీకాల వెబ్సైట్ చరిత్ర - Archived 2016-05-15 at the Portuguese Web Archive ఫిలడెల్ఫియా కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ యొక్క ప్రాజెక్ట్ అయిన టీకాల చరిత్ర పోలియో Archived 2016-05-15 at the Portuguese Web Archive చరిత్ర
- PBS.org - 'పీపుల్ అండ్ డిస్కవరీస్: సాల్క్ పోలియో వ్యాక్సిన్ 1952 ను ఉత్పత్తి చేస్తుంది', పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (పిబిఎస్)
- "కాంక్వరింగ్ పోలియో", స్మిత్సోనియన్, ఏప్రిల్ 2005
- "పోలియో నిర్మూలనకు గ్లోబల్ ప్రయత్నం", డ్రీం 2047 మ్యాగజైన్, ఏప్రిల్ 2004
- "IPOL – Poliovirus Vaccine Inactivated (Monkey Kidney Cell)". U.S. Food and Drug Administration (FDA). 11 December 2019. STN: 103930.
- Poliovirus Vaccines