బెంజమిన్ మకప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెంజమిన్ మకప
టాంజానియా అధ్యక్షుడు
In office
1995 నవంబర్ 23 – 2005 డిసెంబర్ 21
Vice Presidentఓమర్ఆలీ జుమా
టాంజానియా ప్రధానమంత్రిఆలీ సుమాయో
అంతకు ముందు వారుఆలీ హుస్సేన్
తరువాత వారుజాకీయ కీవాట్
టాంజానియా సాంకేతిక విద్యా శాఖ మంత్రి
In office
1992–1995
అధ్యక్షుడుఅలీ హుస్సేన్
వ్యక్తిగత వివరాలు
జననం1938 నవంబర్ 12
టాంజానియా
మరణం2020 జూలై 24
టాంజానియా
జాతీయతటాంజానియన్
రాజకీయ పార్టీటాంజానియా డెమొక్రటిక్ పార్టీ
జీవిత భాగస్వామిఅన్నా మకప
సంతానం2

బెంజమిన్ మకప లేదా బెంజమిన్ విలియం మకాపా (Eng:Benjamin William Mkapa) ( 1938 నవంబరు 12 2020 జూలై 24) [1] టాంజానియా మూడవ అధ్యక్షుడు, 1995 నుండి 2005 వరకు పదవిలో ఉన్నారు.

బాల్యం

[మార్చు]

బెంజమిన్ మకప 1938 నవంబరు 12న టాంగన్యికాలోని మసాసికి సమీపంలో ఉన్న లుపాసోలో జన్మించాడు [2] అతను 1962లో ఉగాండాలోని మేకెరెరే విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు.

అధ్యక్షుడిగా

[మార్చు]
2004 సెప్టెంబరు 11న దార్ ఎస్ సలాంలో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో మకప సమావేశం

1995లో, టాంజానియా మాజీ అధ్యక్షుడు జూలియస్ నైరే మద్దతుతో మకప టాంజానియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బెంజమిన్ మకప ప్రభుత్వం మీద పలు విమర్శలు వచ్చాయి. అధ్యక్షుడిగా 1995 నుంచి 2005 వరకు పనిచేశాడు. బెంజమిన్ మకప టాంజానియా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా టాంజానియా ఆర్థిక అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాడు. మకప ఆర్థిక విధానాలును ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది.

మరణం

[మార్చు]

2020 జూలై 20న ముకపకు మలేరియా సోకింది. అతను 81 సంవత్సరాల వయస్సులో జూలై 24న గుండెపోటుతో మరణించాడు [3] టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మకప మరణించినట్టు ప్రకటించారు. మకప స్వస్థలమైన లుపాసో, మసాసిలో అంత్యక్రియలు జరిగాయి.[4]

  1. "Tanzania's Former President Benjamin Mkapa Dies, Presidency Says". The New York Times. Reuters. 23 July 2020. Archived from the original on 24 July 2020. Retrieved 24 July 2020.
  2. Iranzi, Fabrice (23 July 2020). "Just In: Former Tanzania President Benjamin Mkapa has died". RegionWeek. Retrieved 25 July 2020.[permanent dead link]
  3. "Former Tanzania's president Benjamin Mkapa suffered from malaria, not Covid-19-family". Africanews. 27 July 2020. Retrieved 27 July 2020.
  4. "Former President Benjamin Mkapa laid to rest". The Citizen (in ఇంగ్లీష్). 2020-11-01. Archived from the original on 2023-07-19. Retrieved 2023-07-19.