Jump to content

శివాలయం

వికీపీడియా నుండి
దస్త్రం:IMG 1177a.JPG
వెన్నూతల గ్రామంలో 1885లో నిర్మించిన శివాలయం.2007లో తిరిగి పునరుద్ధరించారు

శివాలయం, అనేది పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నిర్మాణ సంప్రదాయాలు

[మార్చు]
దస్త్రం:PURAATANA SIVAALAYAM LOOPALA PUNARUDHARANA TARUVAATA.jpg
అదే ఆలయంలోని లోపలి భాగం.

సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగంబ్రహ్మ స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణ ద్వారా ముఖంగా ఉంటుంది.

పరివార దేవతలు

[మార్చు]

సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్ఠింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం (శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. వివిధ శైవ గాథలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.

అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు

[మార్చు]

అన్ని శివాలయాలలో బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం రోజు ఇది విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది.

ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది. ప్రతి శివాలయంలో ఈ శివరాత్రి అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కొన్ని ప్రముఖ శివాలయాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శివాలయం&oldid=4364070" నుండి వెలికితీశారు