1556
Jump to navigation
Jump to search
1556 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1553 1554 1555 - 1556 - 1557 1558 1559 |
దశాబ్దాలు: | 1530లు 1540లు - 1550లు - 1560లు 1570లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 16: చార్లెస్ I, పవిత్ర రోమన్ చక్రవర్తి పదవి నుంచి తప్పుకున్న తరువాత, తన కుమారుడు ఫిలిప్ II కు అనుకూలంగా స్పెయిన్ రాజ్యానికి రాజీనామా చేసి, ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
- జనవరి 23: చరిత్రలో అత్యంత ఘోరమైన భూకంపం అయిన షాన్సీ భూకంపం, చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో సంభవించింది; 8,30,000 మంది మరణించి ఉండవచ్చు.
- ఫిబ్రవరి 5: వాసెల్లెస్ యొక్క సంధి : ఫ్రాన్స్, స్పెయిన్ ల మధ్య పోరాటం తాత్కాలికంగా ముగుస్తుంది.
- ఫిబ్రవరి 14: 13 ఏళ్ల వయసులో అక్బరు మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు; అతను 1605 లో మరణించే వరకు పాలన చేసాడు. ఆ సమయానికి భారత ఉపఖండంలోని ఉత్తర, మధ్యభాగం చాలావరకు అతని నియంత్రణలో ఉన్నాయి.
- ఇవాన్ ది టెర్రిబుల్ ఆస్ట్రాఖాన్‌ను జయించి, వోల్గా నదిని రష్యన్ ట్రాఫిక్‌కు, వాణిజ్యానికి తెరిచాడు.
- భారతదేశంపు మొట్టమొదటి ముద్రణా యంత్రాన్ని గోవాలోని సెయింట్ పాల్స్ కాలేజీలో జెసూట్లు ప్రవేశపెట్టారు.
జననాలు
[మార్చు]- తేదీ తెలియదు: రెండవ ఇబ్రహీం ఆదిల్షా ఆదిల్ షాహీ వంశానికి చెందిన బీజాపూరు సుల్తాను. (మ. 1627)