Jump to content

కంకణము/సూర్యాస్తమయము

వికీసోర్స్ నుండి

సూర్యాస్తమయము

శా. ఆటంకంబు ఘటించినార మఁట స్వీయాంశు ప్రభావ్యాప్తిక
   త్యాటోపంబున భానుఁ డావలి మొగంబై, మాపయిం దానిరా
   ఘాటక్రోథవిలోకనారుణసమగ్ర స్ఫూర్తులం గొల్పె; హా
   చేటౌ కాలమునన్ సమస్తగతులన్ జేటే కదా వాటిలున్!

ఉ. మాస్థితి కెంతయున్ వగచి, మమ్ముఁ గరంబుల నుద్ధరించి, యు
   చ్చస్థితిఁ జేర్చె మిత్రుఁ డన సత్య మితండెయటంచు నమ్మితిన్
   స్వస్థత గన్న మాఘనత సై ఁపఁగలేఁడని యెన్ననైతి ని
   ట్లస్థిరు నాశ్ర యించు నెడ నౌ దురవస్థలవిట్టివే కదా ?

చ. మముఁ బయి కెత్తి దాన నగు మాదగు నున్నతి కోర్వలేక దు
   ర్ర్భమ గొని మాయెడన్ దనప్రభల్ గనరా వని యీసుగాంచె; ను
   త్తములు నిజా శ్రి తాళి మహితస్థితి కెంతయు సంతసింత్రు మ
   ధ్యములు తటస్థు లౌదు రనయ మ్మధముల్ చలమూనువారిలన్.

ఉ. అద్దిర! లోకబాంధవుఁడ నంచును మింటికి నంటి మాకుఁ దాఁ
   బెద్దఁట! పెంపుగూర్చునఁట! వింటి రెయీపరి వేషముల్ ఘనో
   ద్యద్దశకే కదా తఱచు దాల్చుట? స్వార్థ పర ప్రసిద్ధులా
   పెద్దలు? పెద్దలందె కనిపించును గ్రించుఁదనంబు లన్నియున్.