నువ్వు ఎప్పుడైనా చదవకుండా పరీక్షకు వెళ్ళేవా? అది అంత మంచి ఆలోచన కాదు కదా.
మనం పరీక్షలకు చదువుతాం, వంటల రెసిపీలు, ఎటు వెళ్లాలో దారి చూపించే వాటిని, రహదారిలో ఉండే గురుతులు, చాలా గైడ్ పుస్తకాలు ఇలాంటివి ఎన్నో చదువడం అవసరం గనుక చదువుతాం. అలానే వైద్యులు, టీచర్లు, ప్లంబర్లు మొదలైన వారు కూడా బాగా చదువుకోని, శిక్షణ పొందిన వారై ఉండాలని మనం ఆశిస్తాం కదా.
బాధ్యతాపరులు సూచనలను చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఎందుకంటే వారు ఏమి చేసినా అది జ్ఞానంతో, జాగ్రత్తతో, సమర్ధవంతంగా చేయాలని కోరుకుంటారు కాబట్టి.
విచారం ఏమిటంటే, క్రైస్తవులలో ఎక్కువ శాతం, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడంలో ఎదిగకుండానే దేవునిలో పరిపక్వత పొందవచ్చు అని అనుకుంటారు (1 కొరింధీ 3:1-2).
ఈ వాక్యధ్యానంలో అలానే దీని కింద ఉన్న బైబిల్ వచనాలను మీరు తీసి చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇవి సజీవమైనవి, బలమైనవి, ఎటువంటి లోపము లేనివి, ఎందుకంటే ఈ మాటలు నావి కాదు, దేవునివి. (కీర్తనలు 12:6; హెబ్రీ 4:12). ఈ వాక్యాలు మన ఆలోచనలను, ఉద్దేశాలను, క్రియలను ప్రభావితం చేస్తూ, దేవుని ప్రణాళికలు నెరవేరేలా చేస్తాయి (యెషయా 55:10,11).
విశ్వాసులకు ముందు ముందు చాలా కఠినమైన రోజులు రాబోతున్నాయి. ఎలాగైతే విద్యా సంబంధమైన వాటికి చదువుకోని సిద్దపడతామో, ఎలాగైతే శిక్షణ లేని వైద్యుల దగ్గరికి వెళ్ళమో, అలాగే ఈ పరీక్షలను మనం సిద్దపడకుండా ఎదుర్కొలేము.
బైబిల్ జ్ఞానం గనుక మనకు లేకపోతే, "ఆధునీకరించబడుతున్న క్రైస్తవ్యాన్ని" ప్రకటిస్తున్న వాక్యవిరుద్ధమైన బోధలకు సులభంగా మోసపోతాం. అందుకే సాతానుకు, విశ్వాసులను క్రమం కలిగి వాక్యానికి ఒక అంకితమైన సమయం ఇవ్వకుండా చేయడమంటే చాలా ఇష్టం.
రోజూ నువ్వు చేసే పనుల జాబితాలో వాక్యాన్ని చదవడం కూడా చేర్చడం ఎలా చేయగలవో ఆలోచించమని నిన్ను నేను తొందర చేయడానికి ఇష్టపడుతున్నాను.
ఒక్క నిమిషం కంటే ఎక్కువ కావాలి అనుకునే వారికి:
ప్రశ్నలు మరియు జవాబులు:
1. క్రీస్తు గూర్చిన అబద్ద బోధలను గుర్తించి, వాటిని తిరస్కరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
• సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే. (2 కొరింథీయులకు 11:3,4)
• కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. (1 పేతురు 1:13)
2. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి నువ్వు పూర్తి శ్రద్దాశక్తులు చూపిస్తున్నావా?
• దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతికి 2:15)
3. దేవుని వాక్యం నీ జీవితంలో ఎంత అమూల్యమైనదో ఎంత ప్రాముఖ్యమైనదో నీకు అర్థమైందా?
• యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. (కీర్తనలు 19:7)
• నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది. (కీర్తనలు 119:105)