This film is very important for the representation of the rural Telangana culture, the language, the customs, and also the nuanced human dynamics unique to that region. And also for the human story it narrates.
వేణు ఎల్డండి దర్శకత్వం ఇంతకముందు ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్నట్టు అనిపించింది. ఉన్న "నటులు" మహా అయితే 10 మంది ఇంతకముందు వేరే సినిమాల్లో చేసి ఉంటారు. కానీ మిగితా వాళ్ళందరూ అదే ఊరి వాల్లో, లేదా ఇంకేదైనా తెలీదు కానీ... పేరుకి support actors and extras ఉండొచ్చు... అద్భుతంగా చేసినరు. దానికి తోడు భీమ్స్ సంగీతం. మస్త్ ఉన్నాయ్ కొన్ని పాటలు అయితే. కావాల్సిన చోట వయొలిన్ తో గుండె పిండేసిండు. సినిమా ల పాత్రలు చూస్తున్నంత సేపు నేను ఏదో మా ఊరికి పోయ్యి ఒచినట్టు ఉండే. మా తాత, అమ్మమ్మ, అత్తమ్మ లు అందరూ కనపడ్డారు నాకు ఇండ్ల. మా ఊరిని, మా వాళ్ళని... నా బలగాన్ని గుర్తు చేసినవ్ అయ్య వేణు... 🙏