ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్
యూదుల ప్రాచీన సాహిత్యాల్లో ఆదాము అవ్వల కథలు (Adam and Eve stories) చాలా ప్రసిద్ధినొందాయి. క్రిస్టియన్ ఎరాలో ఈ పాత కథలన్నీ ఒక చోట చేర్చబడి "లైవ్స్ ఆఫ్ ఏడం అండ్ ఈవ్" (Lives of Adam and Eve) అను ఒక పుస్తకంగా చేయబడింది. 14, 15 శతాబ్దాల్లో ఈ కథలు అన్ని ఐరోపా భాషల్లో అనువదించబడింది. ఈ పుస్తకములో పరలోక నివాసమును కోల్పోయిన తర్వాత అదాము అవ్వలు ఆహారం కోసం పాట్లు పడినప్పుడు వారిని దెయ్యము మోసపరచడం, దేవుడిచే పరలోకమునుండి దెయ్యమును త్రోసివేయబడిన విధానము, ఏబేలు తన సోదరుడైన కయీనుచే చంపబడటం, అదాము స్వప్నము, ఆదాము, అవ్వల మరణము వంటి విషయములు విపులముగా చెప్పబడినవి. అయితే ఈ భాగం క్రైస్తవ బైబిల్లో చేర్చబడలేదు.[1]
అధ్యాయము 1: వారు ఏధేను వనమునుండి గెంటివేయబడిన తర్వాత ఒక గుడారము వేసుకొని ఏడు రోజులపాటూ కన్నీరు మున్నీరైరి.
అధ్యాయము 2: కాని ఏడు రోజుల తర్వాత వారు ఆకలిగొని ఆహారము కొరకై వెదకసాగిరి గాని దొరకలేదు. నిరాశతో అవ్వ (Eve) తన భర్త అయిన ఆదాము (Adam) తో - "స్వామీ... నాకు ఆకలిగానున్నది. నేను తినుటకు నాకు ఏదైనా తీసుకురమ్ము. బహుశా ఆ దేవుడు తిరిగి మనల్ని కరుణించి పూర్వమున్న చోటకి చేర్చవచ్చు" అని పలికెను.
అధ్యాయము 3: అంతట ఆదాము లేచి ఏడు రోజులపాటూ ఆ ప్రాంతమంతా తిరిగెను గాని ఎక్కడనూ ఆహారము సంపాదించలేకపోయెను. అవ్వ ఇట్లనెను "నీవు నన్ను చంపిన యొడల నేను మరణించెదను, అప్పుడు ఆ దేవుడు నిన్ను కూడా పరలోకమునకు నాకొరకై తీసుకొవచ్చును.. అంతట అదాము ఇట్లనెను - "దేవుడు మరో విధంగా శాపించకపోవచ్చు అని పలుకవద్దు. నా మాంసము కొరకై నా చేయిని ఎలా ఎత్తగలను? వద్దు. మనము లేచి బ్రతుకుటకు మరి ఏదైనా చూచుకొనిన తప్పక దొరుకును.
అధ్యాయము 4: ఆ దంపతులు తొమ్మిది రోజుల పాటూ నడిచిరిగాని, జంతువుల ఆహారము తప్ప వారికి ఏధేను వనములో లభించిన ఆహారము లభించకపోయెను. అంతట అదాము అవ్వతో ఇట్లనెను - "దేవుడు జంతువులకును, క్రూరులకును సమకూర్చిన ఆహరము ఇదే. కాని మనం స్వర్గంలో ఉండగా దేవతాహారము తీసుకొంటిమి. కనుక మనము మనల్ని చేసిన దేవుడి ముందు మొరపెట్టుకొనుట మంచిది. ఘోర తప్పస్సుతో మనము పశ్చాతాప పడెదము. అప్పుడు దేవుడు మనపై కృప చూపి మనకు ఏదైనా జీవనాధారము ఇచ్చును.
అధ్యాయము 5: అవ్వ అదామును ఇట్లడిగెను - తపస్సు అనగానేమి? నన్ను ఏ రకమైన తపస్సు చేయగోరెదవు? మను చెప్పిననది మనము నెరవేర్చలేదు కనుక దేవుడు మన ప్రార్థన వినక వెనక్కి తిరుగును. కనుక మనము మనపై ఎక్కువ భారము పెట్టుకొనుట నిష్ప్రయోజనము. స్వామీ నీవు ఎంతవరకూ తపమాచరించెదవు? నేను నీపై శాపమును తెచ్చితిని కదా?
అధ్యాయము 6: అంతట అదాము ఇట్లనెను - నేను చేసినంతగా నీవు చేయలేవు. నీవు నీ శక్తి చొప్పున చేయుము. నేను నలబది దినములు ఉపవాసము చేసెదను. నీవు లేచి టైగ్రిసు నదికి వెళ్ళి అచటనొక బండను తీసుకొని, నీటిలో దానిపై మెడవరకూ మునిగి నిల్చొనుము. నిషేధ పలము తిని మన పెదవులు అపవిత్రములై దేవుని పిలువడానికి కూడా యోగ్యత లేదు కనుక నీవు నోట వెంట మాట రాకుండా చూచుకొనుము. ఇది నీవు ముప్పది ఏడు దినముల వరకూ చేయుము. నేను మాత్రము యోర్దాను నదిలో నలుబది దినములు ఉండెదను. దేవుడు అప్పుడు మనల్ని కరుణించవచ్చును.
అధ్యాయము 7: అవ్వ టైగ్రీసు నదికి వెళ్ళి అదాము చెప్పినట్లు చేసెను. ఆదాము కూడా యోర్దాను నదికి వెళ్ళి అచటనొక బండను తీసుకొని, నీటిలో దానిపై మెడవరకూ మునిగి నిల్చొనెను.
అధ్యాయము 8: యోర్దాను నదితో అదాము ఇట్లనెను - యోర్దాను నీరైన నీతో చెప్పునది ఏమనగా, నాతో ఏడువుము, నీలో ఉన్న సమస్త జలరాశులను నా వద్దకు రప్పించుము, నాతొ సహా వేడుకొననిమ్ము. వాటి కొరకు కాదు, నా కొరకు వేడుకొననిమ్ము. ఎందుకనగా అతిక్రమము చేసినది నేను, అవి కాదు". అంతట ఆ నదిలోని సమస్త జలరాశులు అదాము చుట్టూ చేరెను. ఆ ఘడియనుండి యోర్దాను నది కెరటములు కదలక నిశ్చలమయ్యెను.
అధ్యాయము 9: పద్దెనిమిది రోజులు గడిచెను. సాతాను (Satan) నిప్పులు చెరిగినవాడై దేవదూతల కాంతి రూపంలోకి మారి టైగ్రిస్ నదికి వెళ్ళెను. అవ్వ ఏడుచుట చూచి ఆమెతో కూడా ఏడిచినట్టుగా నటించెను. సాతాను ఆమెతో - ఇక ఏడువక నదినుండి బయటకు రమ్ము. ఇక ఏడువకుము, బాధపడకుము. నీవును నీ భర్తయూ ఎందుకు చింతించుచున్నారు? నీ మొర దేవుడు వినెను, నీ తపస్సును అంగీకరించెను. దేవదూతలమైన మేమందరమూ మీ తరపున దేవునికి విన్నపము చేసుకొంటిమి. నిన్ను నీటినుండి వెలుపలకు తీసుకువచ్చి, ఏధేను వనములో దొరికే ఆహారాన్ని ఇవ్వమని దేవుడు నన్ను పంపెను. కనుక బయటకు రమ్ము, మీకు సిద్ధ పరచిన ఆహారము వద్దకు నిన్ను తీసుకెళ్ళెదను -అని పలికెను
అధ్యాయము 10: అవ్వ సాతాను మాటలు నమ్మి బయటకొచ్చెను. నీరు బహు చల్లగా ఉన్నందున ఆమె మాంసము గడ్డి వలె వణుకెను. ఆమె బయటకొచ్చి నేల మీద పడెను. సాతాను ఆమెను పైకి లేవదీసి ఆదాము వద్దకు తీసుకొనిపోయెను. సాతాను ఆవ్వను తోడ్కొనివచ్చుట చూచి ఆందోళనతో - "అవ్వా, అవ్వా ... నీ తప్పస్సు మాటేమిటి? ఏ అపవాదిచేతనైతే మనము ఆత్మీయ ఆనందము నుండి, పరలోకమునుండి దూరమైయ్యామో అపవాది చేత నీవు మళ్ళీ ఎలా పట్టబడితివి?
అధ్యాయము 11: అవ్వ ఈ మాటలు విన్న పిమ్మట తనను నదినుండి బయటకు నడిపించింది సాతానేయని తెలుసుకొనెను. ఆమె బహుగా రోదిస్తూ నేలపై బోర్లా పడెను. ఆమె రోదన, మూలుగు, దుఃఖము రెట్టింపయ్యెను. ఆమె సాతానుతో ఇట్లనెను - "మమ్ములను ఏ కారణము లేకుండ ఎందుకు బాధించుచుంటివి? మాతో నీకు పనేమి? మేము నీకు ఏమి చేసితిమి? నీవు మా పై కుట్రలు పన్నుచున్నావు. మా యొడల నీకెందుకు మత్సరము? నీ ఘనతను మేము దొంగిలించి నిన్ను అగౌరవపరచలేదు కదా? ఎందుకు మమ్ములను కంగారు పెట్టి కుట్రతో అసూయతో మరణము వరకూ నడుపుచున్నావు?
దెయ్యము త్రోసివేయబడిన విధానము:
అధ్యాయము 12: సాతాను అధికమైన ఉచ్చ్వాస తీసుకొని - ఓ అదామూ, నా పగ, అసూయ, బాధ మీవలన కలిగినది. మీ వలన నేను దేవదూతల మధ్య నేను పొందిన మహిమ నుండి త్రోసివేయబడితిని, మీ వలన ఈ భూమి పై పడితిని - అని పలికెను. అంతట అదాము - ఏమంటివి? నేను నీకు ఏమి చేసితిని? నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పు ఏమిటి? మా వల్ల నీకు ఏ హానీ జరుగలేదని తెలిసికూడా మమల్ని ఎందుకు వెంబడించుచుంటివి? - అని జవాబిచ్చెను.
అధ్యాయము 13: అంతట దెయ్యము ఇట్లు పలికెను - ఏమంటివి? నీ వలననే నేను ఆ చోటనుండి గెంటివేయబడితిని. నీవు ఏర్పడినప్పుడు దేవుని దృష్టినుండి గెంటివేయబడితిని, దేవదూతల సహవాసమునుండి బహిష్కరింపడితిని. ఆ దేవుడు నీలో ఊపిరి ఊదినప్పుడు, నిన్ను ఆయన స్వరూపములో సృష్టించినప్పుడు, మిఖాయేలు (Michael) దూత మమ్మల్ని దేవుని ఎదురుగా నిన్ను ఆరాధింపజేసెను. దేవుడు కూడా ఇదిగో ఆదాము, నా రూపములో ఇతనిని నేను చేసితిననెను.
అధ్యాయము 14:, మిఖాయేలు దూత బయటకు వెళ్ళి సమస్త దేవదూతలను పిలిచి - ఆ దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన ప్రతిరూపమును ఆరాధించుడి - అని చెప్పెను. మిఖాయేలు తనంతట తానే ముందుగా ఆరాధించి తర్వాత నన్ను పిలిచి 'దేవుని స్వరూపమును ఆరాధించుడి అని చెప్పెను. ఆదామును నేను ఆరాధించవలసిన అవసరం నాకు లేదని చెప్పితిని. మిఖాయేను నన్ను బలవంతము చేయసాగెను. నేను ఆగ్రహించి - నన్ను ఎందుకు బలవంతము చేయుచుంటివి? నాకంటే అల్పుడిని నేను ఎలా ఆరాధింతును? ఈ సృష్టిలో నేను అతనికంటే గొప్పవాడను, అతనికంటే ముందు చేయబడితిని. నన్ను ఆరాధించుట అతని బాధ్యత అని అంటిని.
అధ్యాయము 15: ఇది విన్న నా తోటి దేవదూతలందరూ నిన్ను ఆరాధించుట నిరాకరించిరి. అప్పుడు మిఖాయేలు - దేవుని ప్రతిరూపమును ఆరాధించుడి. లేకున్నచో ఆయన ఆగ్రహము మీమీదికి దిగివచ్చును అని హెచ్చరించెను. అప్పుడు నేను - ఆయన నా పై కోపగించినచో నా సింహాసనమును నక్షత్రమండలము పైకి మార్చుకొని పైన ఉండెదను - అని పలికితిని.
అధ్యాయము 16: అంతట దేవుడు ఆగ్రహించి నన్నును, నా తోటి దేవదూతలను మా మహిమనుండి దూరము చేసెను; కేవలము నీ వలననే మీ మా నివాసములనుండి గెంటివేయబడి ఈ భూమిపై పడితిమి. మా మహిమను పోగొట్టుకొన్న మేము ఎంతో దుఃఖించితిమి. మీ ఆనందమును, భోగమును చూచి దుఃఖించితిమి . మీ ఆనందమును, భోగమును చూచి కపటంతో నీ భార్యను మోసపరచితిని, నేను గెంటివేయబడితిని కనుక ఆమె చేతలచే నీవు కూడా గెంటివేయబడేలా చేసితిని.
అధ్యాయము 17: దెయ్యము చెప్పిన మాటలు విన్న ఆదాము - ఓ దేవా, నా ఆత్మను నాశనము చేయగోరిన ఈ అపవాదిని నానుండి దూరముగా తరిమివేయుము. అతను కోల్పోయిన వైభవమును నాకు ప్రసాదించుము. - అని దేవునికి మొఱపెట్టుకొనెను. అంతట సాతాను అక్కడనుండి అదృశ్యమయ్యెను. ఆదాము మాత్రము యోర్దాను నదిలోనే ఉండి నలుబది దినములు చివరి వరకూ తప్పస్సును కొనసాగించెను.
కయీను, ఏబేలు:
అధ్యాయము 18: అవ్వ తన భర్తతో - స్వామీ ... నీవు జీవించు. ఏ పాపమునూ చేయలేదు కనుక నీకు జీవము ప్రసాదించబడింది. నేను దేవుని ఆజ్ఞను లెక్కచేయలేదు కనుక పాపము చేసితిని. నీ జీవన కాంతిలోంచి నన్ను బహిష్కరించుము. సూర్యాస్తమయం అయ్యే చోటికి వెళ్ళి అక్కడనే ఉండి చనిపోవుదును- అని పలికి ఆమె పడమర దిక్కుకు వెళ్ళుతూ విలపించసాగెను. అక్కడ మూడు నెలల గర్భవతి అయిన ఆమె చిన్న గుడారము నిర్మించుకొనెను.
అధ్యాయము 19: ఆమె ప్రసవించే సమయం ఆసన్నమయ్యేసరికి, ఆమె నొప్పితో బాధపడసాగింది. "దేవా నన్ను కరుణించు, నాకు సహాయం చెయ్యి" అని రోదించసాగింది. ఆమె రోదన వినిపించక దేవుని కరుణ ఆమె వద్దకు రాలేదు. "నా స్వామి ఆదాముకి ఎవరు చెబుదురు? సూర్య చంద్రులారా నేను మీకు ప్రార్ధిస్తున్నాను. మీరు తూర్పునకు వచ్చేసరికి నా స్వామి ఆదాముకి సందేశం తీసుకు వెళ్ళండి.
అధ్యాయము 20: ఆ సమయములో "అవ్వ నుండి ఫిర్యాదు అందినది. ఆమె మరొక్కసారి సర్పముతో పోరాడినట్లున్నది" అని అనుకొని తన భార్య అవ్వ వద్దకు వెళ్ళెను. ఆమె ఎంతో క్షోభ పడుట అతడు చూచెను. అవ్వ ఆమె భర్తతో - స్వామీ మిమ్మల్ని చూసిన మరుక్షణం నా ఆత్మ పడుతున్న బాధ తొలగిపోయింది. నన్ను కాపడమని, నా బాధలు తొలగించమని, మీ మాట ఆలకించమని ఆ దేవుడికి నా తరపున విజ్ఞప్తి చేయండి అని పలికెను. అంతట అదాము దేవునికి విజ్ఞప్తి చేసెను.
అధ్యాయము 21: అదిగో, పన్నెండు దూతలు వచ్చెను, రెండు virtues అవ్వకు ఇరువైపులా నిల్చొనెను, మిఖాయేలు కుడివైపున నిల్చొనెను. మిఖాయేలు ఆమె ముఖమును తట్టి - ఆదామును బట్టి నీవు ఆశీర్వదింపబడినావు. అతడి ప్రార్థనలు, విన్నపములు గొప్పవి గనుక నీవు మా సహాయము పొందు నిమిత్తము నేను పంపబడితిని. ఇప్పుడు లెమ్ము. ప్రసవించుటకు సిద్ధంకమ్ము - అని పలికెను. ఆమె కుమారుని కనెను, ఆ కుమారుడు ప్రకాశించి, లేచి పరుగెత్తి గడ్డిపరక తెచ్చి తల్లి చేతిలో పెట్టెను. ఆమె తన కుమారుడికి కయీను అని పేరు పెట్టెను.
అధ్యాయము 22: అదాము తన భార్య అవ్వను, కయీనును తీసుకొని తూర్పునకు పోయెను. దేవుడు మిఖాయేలు దూతచే సమస్త విత్తనాలను పంపి ఆదాముకి ఇచ్చెను, ఆ విత్తనములు మొలిచి ఫలించి, వాటిని తరతరాలపాటూ అదాము, అతని వంశము అనుభవించే విధంగా ఆదాముకు భూమి దున్నుట, పని చేయుట వంటివి చూపించెను. పిమ్మట అవ్వ ఏబేలు అను మరో కుమారుని కనెను. కయీను మరియూ ఏబేలు ఒకేచోట ఉండెను. అవ్వ అదాముతో - స్వామీ, కయీను చేతిలో ఏబేలు రక్తమున్నట్లు దర్శనములో చూచితిని. అందువల్ల నాకు చాలా బాధకలుగుచున్నది - అని చెప్పెను. అంతట అదాము - కయీను ఏబేలును చంపినట్లయితే వారిద్దరినీ వారిద్దరినీ విడివిడిగా ఉంచెదము. వారిద్దరి విడివిడి నివాసములకు సిద్ధం చేసెదము - అని పలికెను
అధ్యాయము 23: కయీనును పంటకాపుగాను, ఏబేలును గొఱ్రెలకాపరిగాను చేసి వారిద్దరిని వేరు వేరు చేసిరి. అయిననూ తరువా కయీను ఏబేలును చంపెను. అప్పటికి అదాము నూట ముప్పై సంవత్సరముల వయసుగలవాడై వుండెను, ఏబేలు నూట ఇరవై రెండు ఏండ్లు గలవాడైయుండెను. తరువాత అదాము అతని భార్యతో కూడి సెత్తు (Seth) అను కుమారుని కనెను.
అధ్యాయము 24: అదాము తన భార్యతో - ఇదిగో కయీనుచే చంపబడ్డ ఎబేలు స్థానంలో సెత్తును కంటిని - అని పలికెను. ఆ తరువాత అదాము ఎనిమిది వందల సంవత్సరములు జీవించి ముప్పై మంది కుమారులను, ముప్పై మంది కుమార్తెలను, మొత్తము అరవై ఆరుగురు పిల్లలను కనెను. వారు భూమి పై వారి వారి దేశములలో విస్తరించిరి.
అదాము స్వప్నము:
అధ్యాయము 25: అదాము సెత్తుతో - నా కుమారుడా, నేను, నీ తల్లియును ఏధేను వనమునుండి గెంటివేయబడిన తర్వాత నేను విన్నది, చూసినది ఇప్పుడు నీకు చెప్పెదను. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూతయైన మిఖాయేలు వచ్చెను. నేను గాలి వంటి రథమును చూచితిని. దాని చక్రములు అగ్నివలె ఉన్నాయి. నేను స్వర్గములో పట్టబడి, రథములో కూర్చొనివున్న దేవుడిని చూచితిని. ఆయన ముఖము మండుచున్న అగ్ని వలే ఉండెను. వేలాది దేవదూతలు రథానికి ఇరువైపులా ఉండిరి.
అధ్యాయము 26: అది చూచిన నేను ఆశ్చర్యపడితిని, భయము నన్ను ఆవరించెను. అంతట నేను నా ముఖము నేలకు ఆంచి దేవునిముందు సాగిలపడితిని. అంతట దేవుడు - ఆస్తికుడా, నీవు దేవుని ఆజ్ఞ అతిక్రమించావు, నీవు నీ భార్యపై అధికారము కలిగియున్ననూ ఆమె మాట వింటివి, నా మాట జవదాటితివి - అని పలికెను.
అధ్యాయము 27: నేను ఈ మాటలను విని నేలపై సాగిలపడి దేవునితో - నా దేవా, సర్వ శక్తిమంతుడా, పరిశుద్ధ దేవా, let not the name that is mindful of thy majesty be blotted out. కాని నేను మరణించి నా ఊపిరి నోటినుండి వెళిపోవును గనుక నన్ను ఆత్మను మార్చుము. మన్నునుండి పుట్టిన నన్ను నీ సన్నిధినుండి త్రోసివేయకుము, నీ సహాయము నుండి నన్ను బహిష్కరించకుము. అదిలో చూడు! సంబంధించిన వాక్యము నా పైకి వచ్చెను. దేవుడు నాతో - నీ దినములు చేయబడినవి, నీవు జ్ఞానముపై మక్కువతో చేయబడితివి, therefore there shall not be taken thy seed forever the right to serve me.
అధ్యాయము 28: ఈ మాటలను విన్న నేను నేలపై సాగిలపడి - నీవు నిత్య దేవుడవు, దేవాతి దేవుడవు, సమస్త జీవరాశులు నిన్ను ఆరాధించుచున్నవి. అన్ని వెలుగులకంటే పై వెలుగు నీవు. నీ కృపవలన కలిగిన మనుష్య జాతిని నడిపించుచుంటివి - అని అంటిని. నేను దేవుడిని ఇలా కొనియాడిన తరువాత దేవ దూత అయిన మిఖాయేలు దేవుని ఆజ్ఞ చొప్పున నా చేయి పట్టుకొని నన్ను పరలోకమునుండి గెంటివేసెను. మిఖాయేలు దండముతో పరలోకము చుట్టూరా ఉన్న నీటిని ముట్టగా అది మంచుగా మారెను.
అధ్యాయము 29: మిఖాయేలు నన్ను ఆ మంచుపై నడిపించి, తిరిగి నన్ను కలసిన చొట దించెను. నా కుమారుడా, విను. నేను జ్ఞాన ఫలమును తిని ఈ వయసులో ఏమి జరుగనున్నదో, మానవజాతి పట్ల దేవుడు ఏమి చేయగోరుచున్నాడో అప్పుడు నాకు ముందే తెలినప్పుడు - రహస్యములు, సంస్కారములు నాకు తెలియపరచబడినవి. దేవుడు అగ్ని కీలల్లో ప్రత్యక్షమై తన మహాత్మ్యము గల నోటితో ఆజ్ఞలు జారీ చేసి పటిష్ఠపరచును; ఆయన నోటినుండి రెండంచుల ఖడ్గము వెలువడును; అవి ఆయనను మహిమలో ఘనపరచును. వాటికి ఆయన అద్భుతమైన స్థలము చూపించును. అవి ఆయన సిద్ధపరచిన స్థలములో దేవునికి నివాసము ఏర్పరచును, అవి ఆయన ఆజ్ఞలను అతిక్రమించుటవలన వాటి పవిత్రత కాలిపోవును, వాటి నివాస స్థలము విడువబడును, దేవుని కోపమునకు గురై వాటంతట అవే విడిపోవును. దేవుడు మరలా వాటిని వెనక్కి రప్పించును, అవి దేవునికి నివాసము నిర్మించును, అప్పుడు ఆ దేవుని నివాసము పూర్వము కంటే హెచ్చించబడును. మరలా పాపము నీతిని అతిక్రమించును. పిమ్మట దేవుడు మనుష్యులతో భూమిపై ఉండును; అప్పుడు నీతి ప్రకాశించుట మొదలవును. దేవుని నివాసము స్తుతించబడును, శత్రువులు దేవుని ప్రేమించు మనుష్యులను గాయపరచలేకపోవును, దేవుడు తాను నిత్యత్వానికి తీసుకొనిపోయే నీతిమంతుల పక్షముగానుండును, దేవుడు ఆయన ప్రేమను తృణీకరించిన దుష్టులను శిక్షించును. పరలోకమును, భూమియూ, పగలు, రాత్రియు, సమస్త జీవరాశులు అన్నీ ఆయన ఆజ్ఞకు లోబడును, అవి ఆయన ఆజ్ఞను మీరవు. మనుష్యులు వారు పనులను మార్చుకొనరు కాని దేవుని ధర్మ శాస్త్రమును మీరుదురు. కనుక దేవుడు ఆయన నుండి చెడును విసర్జించి సూర్యుని వలె ప్రకాశించును. అప్పుడు మనుష్యులందరూ నీటిచే వారి పాపములనుండి శుద్ధిచేయబడుదురు. శుద్ధిచేయబడుట ఇష్టము లేనివారు శిక్షింపబడుదురు. తీర్పు తీర్చబడునప్పుడు, మనుష్యుల్లో దేవుని గొప్పదనము కనిపించినప్పుడు, దేవుడు వారి కార్యాలు గూర్చి తెలిసికొన్నపుడు, ఆత్మను నియంత్రిచుకొను మనుష్యులు సంతోషిచెదరు.
అదాము మరణము:
అధ్యాయము 30: అదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసువాడైన తర్వాత తన రోజులు దగ్గర పడినవని గ్రహించి - "నా కుమారులందరూ నా వద్దకు రావాలి. నేను మరణించే ముందు వారిని ఆశీర్వదించెదను, వారితో మాట్లాడెదను" అని అనెను. ప్రార్థనా గోపురంలో ఆదాము చుట్టూరా ఆయన పిల్లలు మూడు గుంపులుగా చేరిరి. మీరు మమ్ములను ఎందుకు పిలుచుటకు గల కారణమేమి? ఎందుకు పడకపైయుంటిరి? అని పిల్లలు ప్రశ్నించెను. అదాము తన పిల్లలతో - నా పిల్లలారా, నాకు అనారోగ్యము చేసినది, బాధ కలుగుచున్నది" అని పలికెను. అంతట కుమారులు తండ్రితో - తండ్రీ, అనారోగ్యము అనగానేమి? బాధ అనగానేమి? అని ప్రశ్నిచించిరి.
అధ్యాయము 31: అప్పుడు సెత్తు తండ్రితో ఇట్లనెను - ఓ తండ్రీ, పరలోక ఫలమును తినగోరి దిగులుగా పడుకొనియుంటివా? చెప్పుము, నేను పరలోక ద్వారములకు దగ్గరగా వెళ్ళి, నా తలపై మట్టిని వేసుకొని, ద్వారములకు ఎదురుగా నేలపై దేవుని ముందు సాగిలపడి వేడుకొనెదను. దేవుడు నా మొఱ విని తన దూతచే నీవు తినగోరుచున్న పరలోక ఫలమును పంపవచ్చును. అంతట అదాము - అది కాదు కుమారుడా, నేను దాన్ని కోరుటలేదు. నాకు నిస్సత్తువగా, బాధగానున్నది అని అనెను. సెత్తు - ఓ తండ్రీ, బాధ అనగానేమి, నాకు తెలియకున్నది, మానుండి దాయక, దాన్ని గూర్చి అంతా చెప్పుడి.
అధ్యాయము 32: అదాము తన కుమారులకు ఇట్లు సమాధానమిచ్చెను - నా కుమారులారా నేను చెప్పునది వినుడి. దేవుడు నన్నును, నీ తల్లియును చేసి, పరలోకములో ఉంచి, ప్రతి ఫలించే చెట్టును ఇచ్చి, పరలోకంలో మధ్య ఉన్న మంచి-చెడులను తెలిపే ఫల వృక్షము విషయంలో మాత్రము దాన్ని తినవద్దు అని ఆంక్ష విధించెను. పరలోకములో కొంతభాగము నాకిచ్చెను, మరికొంత భాగము మీ అమ్మ అవ్వకి ఇచ్చెను; ఉత్తర గాలి (Aquilo) కి వ్యతిరేకంగా తూర్పు - పడమర దిక్కున ఉన్న చెట్లు నీకిచ్చెను, అవ్వకు దక్షిణ - పడమర భాగాలను ఇచ్చెను.
అధ్యాయము 33: మరియూ ఆ దేవుడు మమ్మల్ని కాపలా కాయుటకు ఇద్దరు దూతలను నియమించెను. దైవ సన్నిధిలో ప్రార్ధించే సమయం ఆసన్నమై ఆ ఇద్దరు దూతలు పైకి వెళ్ళిరి. ఆ ఇద్దరు దూతలు లేకపోవుట శత్రువు చూచెను, మీ అమ్మ నిషిద్ధ ఫలమును తినేవిధంగా చేసెను. తాను తిని నాకు కూడా ఇచ్చినది.
అధ్యాయము 34: వెంటనే దేవుడు మా పై కోపగించి నాతో ఇట్లనెను - నీవు నా మాటను వెనక్కు నెట్టితివి, నేను నీతో చెప్పిన మాటను తృణీకరించితివి, ఇదిగో నీ శరీరముపై డబ్బై దెబ్బలు వేయుదును; నీ కళ్ళు, తల, చెవుల నుండి క్రింది కాలి గోళ్ళ వరకూ, ప్రతీ అవయువములోను అనేక రకములైన దెబ్బలతో నీవు బాధింపబడెదవు, ఇదే దేవుడు విధించిన శిక్ష. ఇవన్నీ దేవుడు నాకు పంపెను, మన జాతి అంతటికీ పంపెను.
అధ్యాయము 35: అదాము తన సంగతులన్నియూ కుమారులకు చెప్పి నొప్పులతో బాధపడుతూ "నేనేమి చేయగలను? కృంగిపోతిని. నొప్పు అంత దారుణముగా భరించియున్నాను" అని పలికెను. అవ్వ తన భర్త దుఃఖపడుట చూచి ఆమె కూడా దుఃఖపడి - ఓ దేవా, ఇతని బాధలను నాకిమ్ము, ఎందుకనగా తప్పిదము చేసినది నేను" అని దేవుని ప్రార్థించి అదాముతో ఇట్లనెను - స్వామీ, నీ నొప్పులలో భాగము నాకియ్యుము, ఎందుకనగా నా తప్పిదము వలననే ఈ స్థితి కలిగినది.
అధ్యాయము 36: అదాము అవ్వతో ఇట్లనెను - లెమ్ము, నా కుమారుడైన సెత్తుతో పరలోకము వద్దకు వెళ్ళి, తలపై మట్టిని పెట్టుకొని, నేలపై సాగిలపడి దేవునికి మొఱపెట్టుకొనుము. దేవుడు నీ పట్ల కనికరము చూపి తన దూతలను జీవము గల నూనె ప్రవహించు చోట ఉన్న దయగల వృక్షము వద్దకు పంపి, నన్ను హరిస్తున్న నా ఈ నొప్పులనుండి విముక్తి కలిగే విధంగా నా తల అంటుటకు నీకు ఒక చుక్క నూనె ఇవ్వవొచ్చును.
అధ్యాయము 37: అప్పుడు సెత్తు, అతని తల్లియూ పరలోకపు ద్వారములయొద్దకు వెళ్ళెను. వారు నడుస్తుండగా, అదిగో, ఒక సర్పము వచ్చి సెత్తుపై డాడి చేసి కరిచింది. అవ్వ ఏడిచి - అయ్యో, ఎంత దౌర్భాగ్యురాలను నేను, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున నేను శపించబడితిని - అని అనుకొనెను. పెద్దగొంతుతో ఆ సర్పముతో ఇట్లనెను - శపించబడిన దెయ్యమా, నీవు దేవుని సన్నిధినుండి వెళిపోవుటకు ఏల భయపడలేదు? బదులుగా ఎగిరిపోవుటకు ధైర్యము చేసితివి?.
అధ్యాయము 38: అంతట ఆ సర్పము మనుష్యుల భాషలో ఇట్లనెను - అవ్వా, మా కోపము నీకు వ్యతిరేకంగా కాదా? మా కోపానికి మీరే కదా కారణం? అవ్వా, చెప్పుము ఆ పండు తినుటకు నీ నోరు ఏల తెరిచితివి? నేను అదల్చిన యొడల నీవు తట్టుకొనలేవు.
అధ్యాయము 39: సెత్తు ఆ సర్పముతో - దేవుడు నిన్ను గద్దించెను, కలతపెట్టువాడా, నాశనము చేయువాడా, సత్యమునకు శత్రువైనవాడా, ఇక మాట్లాడకుము, నోరు మూయుము. దేవుడు నిన్ను పరీక్షకు పిలుచువరకూ ఆయన సన్నిధిలో ఉండి వెళ్ళిపొమ్ము- అని పలికెను. అంతట సర్పము - నీవన్నట్టే దేవుని సన్నిధినుండి నేను వెళ్ళిపోవుదును - అని సెత్తుని కోరలతో గాయపరచి వెళ్ళిపోయెను.
అధ్యాయము 40: నిస్సత్తువగా ఉన్న ఆదాముకు తైలాభిషేకము చేయుటకు సెత్తును అతని తల్లియూ పరలోకపు ప్రాంతంలో క్షమాపణ తైలము కోసం తిరుగసాగిరి: వారు పరలోక ద్వారములయొద్దకు వచ్చిరి. అక్కడున్న మట్టిని తలలపై వేసుకొని నేలవైపు వంగి - ఆదామును కనికరించమని, నొప్పులనుండి విముక్తి ప్రసాదించమని, కరుణతైలపు వృక్షమునుండి కరుణ తైలమును తన దూతచే పంపమని - గట్టిగా విన్నపము చేసుకొనిరి.
అధ్యాయము 41: వారు గంటలతరబడి ప్రార్థనలో వేడుకొనుచుండగా, అదిగో వారియొద్దకు మిఖాయేలు దూత వచ్చి ఇట్లనెను: నేను దేవునిచే మీ యొద్దకు పంపబడితిని. సెత్తూ, నేను చెప్పునది ఏమనగా, ఏడువకుము, నీ తండ్రి ఆదామును తైలముతో అంటుటకు కరుణ తైలము కోసం ప్రార్థించవద్దు.
అధ్యాయము 42: నేను చెప్పునది ఏమనగా, ఆఖరి దినములలో పొందుకొని రక్షించుకోగలవని అనుకొనుట వివేకము కాదు. ఐదు వేల ఐదు వందల సంవత్సరములు సంపూర్తి అయిన తరువాత ఆదాము శరీరమును, చనిపోయిన శరీరములను లేపుటకు రాజు, దైవ కుమారుడైన యేసు క్రీస్తు భూమ్మీదకు వచ్చును. దైవ కుమారుడైన ఆయన తనకు తానే యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది, ఆ నది నుండి బయటకొచ్చి, ఆయనను నమ్మిన వారందరినీ తైలాభిషేకము చేయును. నీటి మూలముగానూ, పరిశుద్ధాత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుటకు సిద్ధమైన వారందరికీ తరతరాలు ఆ అభిషేకము ప్రాప్తించును.
అధ్యాయము 43: సెత్తూ, కాలము పరిపూర్ణమైనది కనుక నీవు నీ తండ్రియొద్దకు వెళ్ళుము. ఆరు రోజులు అతని ఆత్మ శరీరమును విడిచిపెట్టి వెళ్ళును. ఆపిమ్మట స్వర్గమందును, భూమియందును, ప్రకాశించువాటియందును అద్భుతములు జరుగును - ఈ మాటలు చెప్పి మిఖాయేలు వెళ్ళిపోయెను. అంతట సెత్తు, అవ్వ - కుంకుమపువ్వు, వసకొమ్ములు, దాల్చిన చెక్క, నిమ్మగడ్డి వంటి సుగంధ మూలికలతో తిరిగి వచ్చెను.
అధ్యాయము 44: ఆదాము వద్దకు అవ్వ, సెత్తు తిరిగివచ్చి అతనితో సెత్తును సర్పము కరచిన విషయమును చెప్పెను. అంతట ఆదాము అవ్వతో ఇట్లనెను - నీవు ఏమి చేసితివి? మన తర తరములకు వ్యాధిని, అజ్ఞాతిక్రమమును, పాపమును తెచ్చితివి. ఇదే నీవు చేసితివి. నా మరణము తర్వాత నీ పిల్లలతో చెప్పుము. వారు కష్టపడుదురు, విఫలమగుదురు. ఆదియందున్న తల్లిదండ్రులు మనపైకి శాపమును తెచ్చిరి అని వారు అనుకొనెదరు. ఈ మాటలు విన్న అవ్వ బహుగా విలపించెను.
అధ్యాయము 45: మిఖాయేలు చెప్పినట్లే ఆదు రోజులతర్వాత ఆదాము మరణము వచ్చెను. ఆదాము తన మరణమును తెలిసికొని తన కుమారులతో ఇట్లనెను - ఇదిగో, నేను తొమ్మిది వందల ముప్పై ఏండ్ల వయసు గలవాడై యున్నాను. నేను మరణించిన తర్వాత సూర్యుడు ఉదయించే పొలములో నన్ను సమాధి చేయుము. ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత ఆదాము మరణించెను.
అధ్యాయము 46: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏడు రోజులపాటూ చీకటైపోయినవి. సెత్తు తన తండ్రి దేహమును పట్టుకొని ఏడవసాగాడు. అవ్వ తలపై చేతులు పెట్టుకొని దుఃఖముతో నేలను చూడసాగింది. ఆమె పిల్లలందరూ ఏడవసాగిరి. అదిగో మిఖాయేలు వచ్చి ఆదాము తల వద్ద నిల్చొని సెత్తుతో ఇట్లనెను: నీ తండ్రి దేహమువద్దనుండి లెమ్ము, నా వద్దకు వచ్చి దేవుని పట్ల అతని విధి చూడుము. ఇతను దేవుని సృష్టి. దేవుడు అతనిపై కరుణ చూపెను.
అధ్యాయము 47: దేవ దూతలందరూ కొమ్ము బూరలు ఊది - దేవా, నీ ప్రాణిపై కరుణ చూపిన నీవు ఘనుడవు - అని అరచెను.
అధ్యాయము 48: దేవుడు తన చేతిని చాపి ఆదామును పట్టుకొని మిఖాయేలుకు అప్పగిస్తూ - శిక్షలో తీర్పు వచ్చు వరకూ, ఇతని దుఃఖములను నేను మురిపెముగా మార్చేవరకూ, ఇతన్ని నీకు అప్పగిస్తున్నాను. అప్పుడు అతను వానికి సిద్ధము చేయబడిన సింహాసనముపై కూర్చొనును. మరియూ దూతలైన మిఖాయేలు, యురియేలుతో దేవుడు ఇట్లనెను: నార బట్ట చుట్టలు తీసుకొచ్చి, వాటిని ఆదాముపై పరచి, మిగిలిన నార బట్టలు అతని కుమారుడైన ఏబేలు పైన వేసి, ఆదామును, ఏబేలును సమాధి చేయుము. దూతల శక్తులన్నీ ఆదాము ఎదురుగా వెళ్ళెను. మరణనిద్ర సంప్రోక్షించబడింది. మిఖాయేలు, యురియేలు ఇద్దరూ పరలోకములో అవ్వ, సెత్తు కళ్ళ ఎదురుగా ఆదామును, ఏబేలును సమాధి చేసెను. మిఖాయేలు, యురియేలు అవ్వ, సెత్తులతో ఇట్లనెను - మీరు చూసిన విధముగానే మీలో మరణించినవారిని కూడా చేయుము.
అధ్యాయము 49: ఆదాము మరణించిన ఆరు రోజుల తర్వాత అవ్వ తాను కూడా మరణించబోతున్నదని గ్రహించి, సెత్తులో సహా, ఆమె కుమారులు, కుమార్తెలందరినీ పిలిచెను. అవ్వ వారితో ఇట్లు పలికెను: నా పిల్లలారా, వినుడి. నేనునూ, మీ తండ్రియునూ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మిఖాయేలు దూత మాతో చెప్పినది మీకు చెప్పుదును. మన ఆజ్ఞాతిక్రమము వలన దేవుడు మనపై - మొదటిసారి నీటితోను, రెండవసారి అగ్నితోను ఆగ్రహము చూపించును. ఈ రెండు విధములుగా దేవుడు మనుష్య జాతికి తీర్పు తీర్చును.
అధ్యాయము 50: కాని పిల్లలారా, నా మాట వినుడి. రాళ్ళతోను, మట్టితోను పలకలు చేసి వాటిపై నా జీవితమును, మీ తండ్రి జీవితమును, మీరు విన్నది, చూసినది వ్రాయుడి. దేవుడు నీటితో తీర్పు తీర్చిన యొడల మట్టితో చేసిన పలకలు కరిగిపోవును గాని రాతితో చేసిన పలకలు మిగులును; అగ్నితో తీర్పు తీర్చిన యొడల రాళ్ళ పలకలు బ్రద్దలవును, మట్టి పలకలు గట్టిపడును. అవ్వ ఈ సంగతులు తన పిల్లలకు చెప్పిన తర్వాత తన చేతులు ఆకాశమువైపు చాపి, నేలపై మోకరిల్లి ప్రార్థన చేసెను. ఆ ప్రార్థనలో అవ్వ దేవుని స్తుతించి కృతజ్ఞతలు తెలిపి మరణించెను. తర్వాత ఆమెను తన పిల్లను బహుగా దుఃఖిస్తూ సమాధి చేసిరి.
అధ్యాయము 51: వారు నాలుగు రోజులపాటూ విలపిస్తున్నప్పుడు మిఖాయేలు దూత ప్రత్యక్షమై సెత్తుతో ఇట్లనెను: ఓ దేవుని యొక్క మనిషీ, నీ యొక్క మరణించిన వారికొరకు ఆరు రోజులకు మించి దుఃఖించకుము. ఎందుకనగా ఏడవ దినము రాబోయే పునరుద్ధానమునకు గుర్తుగా ఉన్నది; ఏడవ దినమున దేవుడు తన పనులనుండి విశ్రాంతి తీసుకొనెను. అంతట సెత్తు పలకలను చేసెను.
మూలాలు
[మార్చు]- ↑ The great rejected books of the biblical apocrypha – by Charles F Horne, 1917 - vol XIV.